విజయనగరం జిల్లాలో 30 నిమిషాల్లో పిడుగు
ఆధునిక టెక్నాలజీతో ముందే సంభవించే విపత్తులను పసిగడుతున్నారు. క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడినపుడు వాటిలో విద్యుత్ ప్రవాహం ఏర్పడి మెరుపులు వస్తాయి. ఆ చర్య జరుగుతున్నప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాల్లో ఒక్కసారిగా కల్లోలం మొదలవుతుంది. ఆ సమాచారం ఆధారంగా పిడుగుపాటును ముందే ఊహించగలుగుతారు. విజయనగరం, గజపతినగరం, బొండపల్లి, గుర్ల, నెల్లిమర్ల, గంట్యాడ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. పిడుగుపాటును ముందే పసిగట్టడం ద్వారా ప్రాణ, ఆస్తినష్టాన్ని అధికారులు నివారించగలుగుతున్నారు. ప్రభుత్వ తీరుపై ప్రజలు ప్రశంసలు గుప్పిస్తున్నారు.
Comments
Post a Comment